ఢిల్లీలో వరుసగా 15ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. గత రెండుసార్లు జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ జీరో సీట్లు సాధించింది.
తాజాగా ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైంది. ‘ప్యారీ దీదీ యోజన’ పథకం ద్వారా మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల హామీ ప్రకటించింది.