కుటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైయస్ జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భయంతోనే చంద్రబాబు, లోకేష్ లు నిత్యం కుట్రలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. వైయస్ జగన్ గారిని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఏడు నెలలుగా ప్రతిరోజూ పచ్చి అబద్దాలతో అద్భుతమైన కథలను అల్లి తమ అనుకూల ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ తప్పుడు కథనాలను అడ్డం పెట్టుకుని వైయస్ఆర్ సీపీ ముఖ్యులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేయిస్తున్నారని అన్నారు.