ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో క్విక్ డెలివరీ సేవలను ముంబయి, బెంగళూరులోని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ప్రారంభించింది. దీంతో ఇక నుంచి 15 నిమిషాల్లో ఫుడ్‌ను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇది ఇంకా హైదరాబాద్‌లో అమలు కాలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి రానుందో సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే జొమాటో అప్లికేషన్ సెర్చ్ విభాగంలో ‘15 నిమిషాల్లో డెలివరీ’ అంటూ ట్యాబ్‌ను ప్రవేశపెట్టింది.