వాతావరణ సమాచార సేకరణ అంశంపై కేంద్రప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రచిస్తోంది. ఇకపై స్వదేశీ విమానాల సాయంతో వాతావరణ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని స్వీకరించేలా యోచిస్తోంది.
నిత్యం దేశంలోని వివిధప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న స్వదేశీ విమానాలు.. వాతావరణ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో వాతావరణ పరిస్థితిపై కచ్చితమైన సమాచారంతో ప్రయాణిస్తుంటాయి.ఈ సమాచారాన్ని తప్పనిసరిగా భారత వాతావరణశాఖతో పంచుకునేలా కేంద్రం ప్రణాళిక రచిస్తోంది.