గత ఐదేళ్లలో జలజీవన్ మిషన్, అమృత్ వంటి పథకాలు నిర్జీవం కావడం చేశామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అయన మాట్లాడుతూ... అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రానున్న రోజుల్లో ప్రజలకు మేలు చేయాలన్నారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ మాట్లాడుతూ.... ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మాత్రమే నిధులు వినియోగించాలన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ..... ఉపాధి నిధులు సమర్థవంతంగా ఖర్చుచేశామన్నారు. 60 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. సమీక్షలో జడ్పీ సీఈవో వీవీఎస్.లక్ష్మణరావు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్ధ కమిషనర్ కేతన్ గార్గ్ , జిల్లా అధికారులు వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు ,ప్రజాప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.