మహానందిలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కోదండ రామాలయంలో వేకువజామున్నే ఆలయ వేదపండితులు,అర్చకులు ప్రత్యేక తిరుమంజన సేవలు నిర్వహించిన అనంతరం కోదండరాముల వారి ఉత్సవ మూర్తుల విగ్రహాలకు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక వాహనంపై ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఉత్తర గాలి గోపురం వద్దకు తీసుకొచ్చి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తారు. అనంతరం కోదండరామాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు.