ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించా లని సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్ ఈ. నాగరాజు డిమాండ్ చేశారు. గురువారం సెవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ అధ్వర్యంలో వివిధ ప్రజా, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు జిల్లా పరిషత గాంధీ విగ్రహం ఎదుట కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. కమిటీ కన్వీనర్లు జంధ్యాల రఘుబాబు, ప్రసాద్‌శర్మ, ఏపీజీబీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరెడ్డి పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలింపు ధర్మం కాద న్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, అధికారుల సంఘం రాష్ట్ర అధ్య క్షుడు రియాజ్, రాయలసీమ విద్యావంతుల ఐక్యవేదిక నాయకుడు భాస్కర్‌రెడ్డి, బీఎస్ ఎనఎల్ యూనియన రామరాజు, ఏఐబీఈఏ నాయకులు ఎల్లయ్య, రోజారమణి, శివప్రసాద్, ఎల్‌ఐసీ యూనియన నాయకుడు సునీయ కుమార్, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.