రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించడం లేదంటూ రాజస్థాన్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది.
గతేడాది సెప్టెంబరు 17న రూ.746 కోట్ల జరిమానా వేసింది. దానిని కొట్టివేయాలని కోరుతూ రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు జరిమానా చెల్లింపుపై స్టే విధించింది.