ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల్ని కంటే 84 వేల రూపాయలిస్తాం..: మహిళలకు బంపరాఫర్ ఇచ్చిన రష్యా సర్కారు

international |  Suryaa Desk  | Published : Fri, Jan 10, 2025, 10:06 PM

పెళ్లి చేసుకున్న ప్రతీ అమ్మాయి తాను తల్లి కావాలని ఎన్నెన్నో కళలు కంటుంది. ఏవైనా సమస్యలు ఉన్నా ఆస్పత్రుల చుట్టూ తిరిగుతూ.. లక్షల్లో డబ్బు ఖర్చు చేసి మరీ అమ్మా అనే పిలుపుకు దగ్గరవుతుంది. ఆరోగ్య సమస్యలు, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా తల్లిదండ్రులు లెక్కచేయరు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ రష్యాలో మాత్రం తల్లి కావాలంటే ఆర్థిక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లయ్యే ప్రతీ అమ్మాయికి ఆ సర్కారు 84 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


పాతికేళ్లుంటే చాలు 10 వేల రూబిళ్లు..


25 ఏళ్లకంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే తల్లి అయితే రష్యా సర్కారు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ముఖ్యంగా 10, 000 రూబిళ్లు అంటే ఇండియా కరెన్సీలో అక్షరాలా 84 వేల రూపాయలు అందజేస్తామని వివరించింది. రష్యాలోని కరేలియా ప్రాంత వాసుల అయి ఉండి.. స్థానిక విశ్యవిద్యాలయం లేదా కళాశాలల్లో విద్యనభ్యసించే ప్రతీ అమ్మాయికి ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. అయితే పిల్లల్ని కనేందుకు రష్యా సర్కారు ప్రోత్సహకాలను అందించేందుకు పెద్ద కారణమే ఉందిలెండి.


వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువత సంఖ్య తగ్గుతూ..


రష్యాలో రోజురోజుకూ జనాభా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ యువత సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ దేశాలు సైతం ప్రోత్సహకాలు అందించాయి. అదే బాటలో నడవాలని రష్యా కూడా నిర్ణయించుకుంది. ఈక్రమంలోననే పలు ప్రోత్సహకాలు అందించేందుకు సిద్ధం అయింది. గతంలో మొదటి సారి తల్లి అయిన మహిళకు 6,34,400 రూబిళ్లు ఇచ్చేవాళ్లు. కానీ 2024లో దీన్ని 6, 77, 000లకు పెంచారు. అలాగే రెండోసారి తల్లయ్యే మహిళలకు 8,33,000 రూబిళ్లు ఇస్తుండగా.. గతేడాది నుంచి దీన్ని 8,94,000లకు పెంచారు.


2024 మొదట్లో రష్యాలో కేవలం 5,99,600 జననాలు మాత్రమే నమోదు అయ్యాయి. 2023తో పోలిస్తే 16 వేల జననాలు తగ్గాయి. గత పాతిక సంవత్సరాలలో ఇంత తగ్గుదల ఎప్పుడూ కనిపించలేదు. ఇది చూస్తుంటేనే రష్యాలో జనాభా పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ ప్రోత్సహకాలు అందిస్తూ.. జనాభా వృద్ధి కోసం రష్యా చర్యలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com