శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిలు దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న వారికి ఆలయ ఈవో శ్రీనివాసరావు వేదపండితులు అర్చకులు ఆలయ మర్యాదలతో తిలకధారణ చేసి ఘన స్వాగతం పలికారు.అనంతరం మంత్రులు స్వామివారి గర్భాలయంలో అభిషేకం బిల్వార్చన చేసుకుని అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు అందుకున్నారు. ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న తర్వాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్ధప్రసాదాలు, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, జ్ఞాపికను అందించారు.