ప్రసవ నొప్పులు రావడంతో గర్భిణీ మహిళను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు అంబులెన్స్ లో వెళ్లగా ఆసుపత్రికి వెళ్లే లోపే అంబులెన్స్ లో ఓ గర్భిణీ ప్రసవించింది.
ఆదివారం వల్లూరు మండలం పెద్దపుత్తకు చెందిన తుమ్మల శంకర్ భార్య సుధామని మొదటి కాన్పు కోసం కమలాపురంకు వెళ్లే సమయంలో నొప్పులు ఎక్కువయ్యాయి అంబులెన్స్ లోనే పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. అంబులెన్స్ ఈఎంటి దస్తగిరి, పైలట్ శివప్రసాద్ రెడ్డి లు సహాయం చేశారు.