పుల్లంపేట మండలం అనంతసముద్రం కదిరి గల గుట్ట వద్ద ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఎనిమిది లక్షలు విలువ గల 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని రాజంపేట డిఎస్పి సుధాకర్ తెలిపారు.
సోమవారం ఆయన పుల్లంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజంపేట రూరల్ సీఐ బివి రమణ, నందలూరు ఎస్సై వెంకటేశ్వర్లు, పుల్లంపేట ఎస్సై మోహన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.