చిత్తూరు జిల్లా నగరి మండలంలోని మాంగాడు అటవీప్రాంతంలో సోమవారం 2,900 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి తెలియజేశారు.
తమకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు నగరి, నాగలాపురం ఎక్సైజ్ సీఐలు శ్రీనివాసులు రెడ్డి, కె. బాబు తమ సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో దాడులు నిర్వహించామన్నారు. ఈ ఘటనలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.