కారంచేడులోని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వగృహంలో సోమవారం సంక్రాంతి సందడి నెలకొంది. రాజమండ్రి ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కుటుంబ సభ్యులు సాంప్రదాయ పద్ధతిగా భోగిమంటలు వేశారు.
ఈ వేడుకలలో సినీ హీరో దగ్గుబాటి అభిరామ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.