తమ గ్రామానికి దారి సౌకర్యం కల్పించాలని సోమవారం గ్రామస్తులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కాలేపల్లి గ్రామంలోని ధర్మరాజుల దేవాలయానికి ఎకరా భూమి ఉందని.
ఈ భూమిని ధర్మకర్త బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు పొందడమే కాకుండా కంచవేసి గ్రామానికి దారి లేకుండా చేశారన్నారు. కలెక్టర్ ఈ విషయంపై స్పందించి దేవదాయ భూములను స్వాధీనం చేసుకొని రైతులకు దారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.