సత్యవేడు నియోజకవర్గం బీఎన్. కండ్రిగ మండలంలోని అన్ని దుకాణాల్లో తూనికలు, కొలతల అధికారి మల్లేశ్వర్ రెడ్డి సోమవారం తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా తక్కెడల్లో ఏవైనా తేడాలుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏటా తప్పనిసరిగా తూనికలకు ముద్రలు వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.