మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఎక్కువ వడ్డీ కావాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఫెడరల్ బ్యాంక్ మీకో శుభవార్త అందించింది. రూ.3 కోట్ల లోపు ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించినట్లు తెలిపింది. అంతే కాదు 444 రోజుల మెచ్యూరిటీ టెన్యూర్ గల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ సైతం తీసుకొచ్చినట్లు తెలిపింది. దీని ద్వారా గరిష్ఠ వడ్డీ రేటు కల్పిస్తోంది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు జనవరి 10, 2025 నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది.
కొత్త ఎఫ్డీ స్కీమ్..
ఫెడరల్ బ్యాంక్ కొత్తగా 444 రోజుల టెన్యూర్‌తో స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా జనరల్ కస్టమర్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఇంతకు ముందు 777 రోజులు, 50 నెలల స్కీమ్స్ ద్వారా జనరల్ కస్టమర్లకు గరిష్ఠంగా 7.40 శాతం వడ్డీ ఇచ్చేది. ఇప్పటి నుంచి కొత్త స్కీమ్ ద్వారా అధిక వడ్డీ రానుంది. ఇక 7 రోజుల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 3 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ లభిస్తోంది.
ఫెడరల్ బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇలా..
7 రోజుల నుంచి 29 రోజుల డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 3 శాతం వడ్డీ ఇస్తోంది.
30 రోజుల నుంచి 45 రోజులకు 3.50 శాతం, 46 రోజుల నుంచి 180 రోజులకు 5.50 శాతం వడ్డీ ఇస్తోంది.
181 రోజుల స్కీమ్ ద్వారా 6.50 శాతం, 182 రోజుల నుంచి 270 రోజుల వరకు అయితే 6.25 శాతం వడ్డీ
271 రోజుల నుంచి ఏడాది లోపుఅయితే 6.50 శాతం, 1 సంవత్సరం అయితే 7 శాతం వడ్డీ
ఏడాది 1 రోజు నుంచి 399 రోజులకు 7.25 శాతం వడ్డీ లభిస్తోంది.
400 రోజుల స్పెషల్ స్కీమ్ ద్వారా 7.35 శాతం వడ్డీ ఇస్తోంది.
401 రోజుల నుంచి 443 రోజులకు అయితే 7.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఇక కొత్తగా తీసుకొచ్చిన 444 రోజుల స్కీమ్ ద్వారా 7.50 శాతం (గరిష్ఠ వడ్డీ) ఇస్తోంది.
445 రోజుల నుంచి రెండేళ్లలోపు అయితే 7.25 శాతం, 2 ఏళ్ల నుంచి 776 రోజులకు 7.15 శాతం ఇస్తోంది.
777 రోజుల స్కీమ్ ద్వారా 7.40 శాతం, 778 రోజుల నుంచి 3 ఏళ్లలోపు అయితే 7.15 శాతం ఇస్తోంది.
3 ఏళ్ల నుంచి 50 నెలలలోపు అయితే 7.10 శాతం, 50 నెలలు అయితే 7.40 శాతం వడ్డీ ఇస్తోంది.
50 నెలల నుంచి 5 ఏళ్ల వరకు అయితే 7.10 శాతం, 5 సంవత్సరాల పైన అయితే 6.60 శాతం వడ్డీ వస్తుంది.