జిమ్‌కి వెళ్తేనే ఫిట్‌గా ఉంటారనుకుంటే పొరపాటే. కారణం, జిమ్‌కి వెళ్లినంత మాత్రాన ఫిట్‌గా మారరు. బరువుతగ్గరు. దీనికి సరైన రొటీన్ ఫాలో అవ్వాలి. బరువు పెరగడం వల్ల చాలా సమస్యలొస్తాయి. అందుకే, బరువు తగ్గించుకోవాలి. దీనికోసం జిమ్ మాత్రమే ఏకైక పరిష్కారం అనుకోవద్దు.
జిమ్‌లో అడుగు పెట్టకుండానే బరువు తగ్గించుకోవచ్చు.స్టామినాని పెంచుకోవచ్చు. దీంతో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. చేతులు, తొడలు సన్నబడతాయి. నడుము చుట్టుకొలత తగ్గుతుంది. బరువు తగ్గితే ముఖం కాంతివంతంగా మారుతుంది. బ్రెయిన్ సరిగా పనిచేస్తుంది.
అయితే, బరువు తగ్గేందుకు ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ చేయొచ్చు. దీని వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరి ఆ వర్కౌట్స్ ఏంటో తెలుసుకోండి.
ఎల్బో టూ నీ
మోచేయి నుండి మోకాలి వరకూ ఉదర కండరాలను లక్ష్యంగా ఈ వర్కౌట్ చేయొచ్చు. ఒక సెట్‌లో మొత్తం 100 సార్లు చేయండి. దీనికోసం కుడి మోచేతితో ఎడమ మోకాలిని, ఎడమ మోచేతితో కుడి మోకాలిని తాకాలి. రెగ్యులర్‌గా చేస్తే బరువు తగ్గుతారు.
బరువు తగ్గేందుకు ఓట్స్‌ని ఎలా తినాలి.
టో టచ్ స్ట్రెచ్
దీనిని దాదాపు 50 సార్లు చేయాలి. దీనిని చేయడం వల్ల తొడలు, వీపు, పొట్ట కండరాలు సాగుతాయి. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది.
ఆర్మ్ వాకింగ్
చేతుల్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ వర్కౌట్ బెస్ట్ వర్కౌట్. రోజూ 20 సార్లు ఆర్మ్ వాకింగ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది కడుపు కండరాలను టోన్ చేస్తుంది. శరీరంలోని అన్నికండరాలను సాగదీస్తుంది.
బట్ కిక్
ఈ వర్కౌట్ కూడా కాళ్లుు, తొడల కొవ్వుని తగ్గిస్తుంది. దాదాపు 100 సార్లు బట్ కిక్ ప్రాక్టీస్ చేయాలి. దీంతో లోయిర్ బాడీ స్ట్రాంగ్‌గా మారుతుంది. కాలి కండరాలు బలంగా మారతాయి. ఎక్కువగా గంటలు కూర్చుని పనిచేసేవారు ఈ వర్కౌట్ కచ్చితంగా చేయాలి.
జంపింగ్ జాక్స్
బరువు తగ్గేందుకు ఈ జంపింగ్ జాక్స్ బాగా హెల్ప్ చేస్తాయి. ఉదయాన్నే 100 సార్లు జంపింగ్ జాక్స్ చేయండి. దీంతో బాడీ మొత్తం స్లిమ్‌గా మారుతుంది. గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఎనర్జీ పెరుగుతుంది. హిప్ కండరాలు బలంగా మారతాయి. గుండె సమస్యలు దూరమవుతాయి.
స్పాట్ స్ప్రింట్
ఉన్నచోట పరుగెత్తడం. కేలరీలని బర్న్ చేయడానికి స్ప్రింటింగ్ కంటే బెస్ట్ వర్కౌట్ ఏదీ లేదు. ఇది గుండె ఆరోగ్యాన్నిమెరుగ్గా చేస్తుంది. ఈ వర్కౌట్‌ని స్పీడ్‌గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. త్వరగా రిజల్ట్ కనిపిస్తుంది.