ఈ మధ్య కాలంలో చాలా మంది యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. తినే ఆహారంలో ప్యూరిన్స్ అనే రసాయనం విచ్ఛిన్నం కావడం వల్ల యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.దీని కారణంగా కీళ్లలో నొప్పులు, వాపు సమస్యలు వస్తాయి.యూరిక్ యాసిడ్‌ని మనకు ఈజీగా లభించే వాటితోనే తగ్గించుకోవచ్చు. యూరిక్ యాసిడ్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఉసిరి కాయ ఎంతో చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ ఒక ఉసిరి కాయ తిన్నా.. ఉసిరి రసం తాగినా యూరిక్ యాసిడ్ అదుపులోకి వస్తుంది.దాల్చిన చెక్క, తేనెతో తయారు చేసిన కషాయాన్ని తాగినా యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది. దాల్చిన చెక్క వేసి నీటిని బాగా మరిగించి అందులో తేనె కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది.ప్రతి రోజూ వేపాకుల్ని నమిలి తిన్నా యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్న చోట అల్లం వెలుల్లి పేస్ట్ కలిపి రాస్తే నొప్పులు తగ్గుతాయి.నల్ల ఎండు ద్రాక్ష తిన్నా యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది. బిర్యానీ ఆకులతో తయారు చేసి కషాయాన్ని తాగినా యూరిక్ యాసిడ్ లెవల్స్ నియంత్రణలోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.