డైలీ ఓ అరటిపండు తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చునని వైద్యులు అంటుంటారు. అరటిపండులో ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇక అరటిపండులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల.. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను పెంచుతుందని కొందరు అంటుంటారు. అరటిపండులో చక్కెర, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. బరువు పెరగకుండా ఉండాలనే లక్ష్యంగా పెట్టుకున్నవారు వీటికి దూరంగా ఉండాలంటున్నారు న్యూట్రీషనిస్ట్ షాలినీ సుధాకర్. అరటిపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుందన్నారు.అరటిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పోషకాహార నిపుణుడు సుధాకర్ అన్నారు. ఎందుకంటే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారికి అరటిపండు బెస్ట్ ఆప్షన్ అని న్యూట్రీషనిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. అరటిపండ్లలో అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల.. ఎక్కువసేపు ఆకలి వేయదని చెబుతున్నారు. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో తోడ్పడతాయని.. తద్వారా బరువు తగ్గడంలో సహాయం దొరుకుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లు తినవచ్చా?
అరటిపండ్లలో అధిక చక్కెర కంటెంట్ ఉంటుంది. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండటం మంచిది. అయితే డయాబెటిస్ రోగులు అరటిపండ్లను మితంగా తినవచ్చని జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన చీఫ్ డైటీషియన్ డెల్నాజ్ టి. చందువాడియా చెప్పారు.