శ్రీకాకుళం జిల్లా, గార మండలం బందరువానిపేట వద్ద గురువారం మధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్య కారుడు కుందు గడ్డెయ్య(41) పడవ బోల్తా పడి మరణించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గడ్డెయ్య, మరో నలుగురితో కలిసి బోటుపై సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. సముద్రంలో కొంతదూరం వెళ్లేసరికి అలల తాకిడికి బోటు బోల్తా పడింది. బోటులో ఉన్న గడ్డెయ్య సముద్రంలో పడి చనిపోయాడు. కాగా గడ్డెయ్యకు భార్య తోటమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చేపల వేటే జీవనాధారంగా బతు కుతున్న గడ్డెయ్య కుటుంబం దిక్కులేనిదైంది. ప్రభుత్వం తమను ఆదు కోవాలని వారు కోరుతున్నారు. భార్య తోటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ఎం.చిరంజీవిరావు కేసు నమోదు చేశారు.