ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖ స్టీల్ పరిశ్రమకు సంబంధించి కీలకమైన విషయాలను ప్రకటించారు. ఈ 7 నెలల్లో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన రూ. 11,440 కోట్ల ప్యాకేజీని స్వాగతిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులకూ చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ‘‘విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రతీసారి కష్టపడిందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీతో ఈ పరిశ్రమ మరింత బలపడుతుందని వెల్లడించారు.ఈ క్రమంలో ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మా ప్రాధాన్యత. అందరికీ సంక్షేమం, అభివృద్ధి అందించే దిశగా అడుగులు వేస్తూ, దేనికైనా ప్రయత్నిస్తామని చంద్రబాబు అన్నారు. ‘ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్న ఆశల్ని తీర్చేందుకు, విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు, ఉద్యమ స్పూర్తితో మనం కలసి కట్టుగా కృషి చేద్దామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.