ప్రేమ పేరుతో న మ్మించి మోసం చేయడంతోపాటు బెదిరింపులకు పాల్పడటంతో మనస్థా పానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృ తుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు యువతి, ఆమె తండ్రి, ఆమె స్నేహితురాలిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితుడి తండ్రి, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా, ఉప్పుగుండూరు గ్రామంలోని అంబేడ్కర్‌కాలనీకి చెందిన కందుల దానియేలు రెండవ కుమారుడు ప్రవీణ్(28)కు ఒంగోలు గోపాలనగరానికి చెందిన ఓ యువతి తో పరిచయం ఏర్పడింది. పైచదువుల కోసం ఆ యువతి విదేశాలకు వెళ్లింది. అప్పటి నుంచి తన చదువులకు కావాల్సిన డబ్బులు పంపించాలని, లేకుంటే నీతో స్నేహం చేయనని ఫోన్‌లో నిత్యం తీవ్ర ఒత్తిడి చేస్తోంది. అ దేమిటని అడిగిన ప్రవీణ్‌ను ఆమె తండ్రి తిరుమలరావు, ఆమె స్నేహితు రాలు పలుమార్లు బెదిరించి, కులం పేరుతో దూషించారు. దాంతో పాటు సోషల్ మీడియాలో ప్రవీణ్ కుటుంబసభ్యులను బజారుకీడుస్తామని బె దిరించారు. ఓ వైపు ప్రేమ విఫలమవడం మరోవైపు బెదిరింపులతో మన స్థాపానికి గురైన ప్రవీణ్ బుధవారం ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. అందుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవా లని యువకుడి తండ్రి దానియేలు గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎన్‌జీపాడు పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.