కేంద్ర మంత్రి అమిత్ షా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్‌తో చర్చించారు. అంతర్రాష్ట నది జలాల వివాదాలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. అలాగే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రజల మధ్యకు వస్తున్నారా?, ఆయన ప్యాలెస్‌లకు సంబంధించిన విషయాలను సైతం కేంద్ర మంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,400 కోట్లను కేంద్రం ప్రకటించింది. ఆ మరునాడే కేంద్ర మంత్రి అమిత్ షా.. అమరావతికి రావడం ప్రాధాన్యత సంతరించుకొంది.