ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. NDRF 20వ వ్యవస్థాపక దినోత్సవం, NIDM దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ ఒకే సమయంలో మూడు కార్యక్రమాలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఏపీలో కూటమికి మంచి విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(ఆదివారం) కొండపావులూరులో NDRF రైజింగ్ డే వేడుకలు జరిగాయి. NDRF 10వ బెటాలియన్‌ను ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరై ప్రారంభించారు. NDRF పరికరాల గ్యాలరీని అమిత్‌షా సందర్శించారు. తిరుపతి రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను.. వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, బండి సంజయ్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే NDRF ఉంటుందని అన్నారు. మనుషుల విపత్తు నుంచి కాపాడటానికి NDA ముందు ఉంటుందని చెప్పారు.. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలన దక్షతతో పని చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల్లో ఏపీకి మోదీ రూ. 3 లక్షల కోట్లు సాయం అందించారని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.11,440 కోట్లు సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తుచేశారు.