పరిశుభ్రమైన వాతవర ణం గ్రామాల అభివృద్ధికి తోర్పడుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గం కేంద్రమైన శింగనమలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో కలసి చీపురుపట్టి అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో చెత్తను ఊడ్చారు. తహసీల్దార్ సాకే బ్రహ్మయ్య, ఎంపీడీఓ, నిర్మలా కుమారి, ఈఓపీఆర్‌డీ, వెంకట లక్ష్మి, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు డేగల కృష్ణ మూర్తి మూరుతినాయుడు, మాసూలచంద్ర తదితరులు పాల్గొన్నారు.