పవిత్రమైన తిరుమలలో జరుగుతున్న అనాచారాలపై కేంద్రం జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో తిరుపతిలో తొక్కిసలాట, తిరుమలలో అగ్నిప్రమాదం, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసేలా జరుగుతున్న వ్యవహారాలపై కేంద్ర డిజాస్టర్ మేనేజ్ మెంట్ నుంచి సమీక్షకు ఉన్నతాధికారుల బృందం రానున్నదని తెలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భయపడ్డారని అన్నారు. దీనిని అడ్డుకునేందుకు విజయవాడకు వచ్చిన అమిత్ షా కాళ్ళావేళ్ళా పడి ఈ ఉత్తర్వులను రద్దు చేయించుకున్నారని ఆరోపించారు.