శ్రీకాకుళం జిల్లా, నందిగాం పరిధిలోని పెద్దతామ రాపల్లి గ్రామానికి చెంది న గోరు ఖగేశ్వరరావు(22) ఆదివారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. చేనేత కార్మికుడు గోరు వెంకటరమణ, కుమారి దంపతుల కుమారుడు ఖగేశ్వరరావు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. మూర్ఛ వ్యాధితో బాధపడుతూ మానసిన ఆందోళనకు గురయ్యాడు. దీం తో ఆదివారం తండ్రి పనిమీద బయటకు, తల్లి కన్నవారి గ్రామం కంట్రగడ వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసు కొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న వాళ్లు గమనించి తల్లిదండ్రులకు సమాచా రమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ జీవీ రమణ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.