కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం త్వరలో ఏపీ మెుత్తం అమలు చేస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సౌరవిద్యుత్ ఫలకాలు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని మంత్రి చెప్పారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకు జగన్ సైతం ముందే ఉంటారని గొట్టిపాటి ధ్వజమెత్తారు. ఇద్దరి పాలన మధ్య తేడా ఏంటో ఏపీ ప్రజలకు బాగా తెలుసంటూ చురకలు అంటించారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. జగన్‌కు ఒక్క అవకాశమని నమ్మి గెలిపిస్తే ఏపీని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.