పరిశ్రమల్లో భవన నిర్మాణ అనుమతులపై ఏపీ బిల్డింగ్ రూల్స్-2017కు సవరణలు చేస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో పరిశ్రమల్లో కూడా బహుళ అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నారు. నిర్మాణాలకు, స్టోరేజ్ అవసరాలకు భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తారు. ఆయా ప్లాట్‌ల పరిమాణం బట్టి పరిశ్రమలకు అనుమతి ఇచ్చే విషయంలో మార్గదర్శకాలను రూపొందించారు.