బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు నమోదవుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు.పేపర్ లీక్‌లను.. యువత హక్కులను కాలరాసే ఆయుధంగా రాహుల్ పేర్కొన్నారు. బీహార్‌లో బీపీఎస్‌సీ అభ్యర్థుల నిరసనల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని రాహుల్ హామీ ఇచ్చారు. పోలీసులు నేరస్థులను అరెస్టు చేయడానికి బదులుగా విద్యార్థులను కొడుతున్నారు అని ఆయన విమర్శించారు.