హెచ్1బీ వీసాలను అమెరికా కొనసాగిస్తుందా లేక రద్దు చేస్తుందా అని అడిగిన ఓ విలేకరి ప్రశ్నకు ఆ దేశ నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సూటిగా సమాధానం చెప్పారు.
ముఖ్యంగా ఈ అంశంపై రెండు వైపుల వాదనలు తనకు నచ్చాయని వివరించారు. సమర్థవంతమైన ప్రజలు తన దేశానికి రావడాన్ని తానెంతగానో ఇష్ట పడతానని స్పష్టం చేశారు. ఇది కేవలం ఇంజినీర్ల గురించి మాత్రమే కాదంటూ.. సమర్థులైన అన్ని దేశాల వారికీ వర్తిస్తుందంటూ చెప్పుకొచ్చారు.