కనిగిరి పట్టణంలోని ఎమ్ఎన్ఎం కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా కళాశాల కరస్పాండెంట్ ఏలూరు సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించే జాబ్ మేళాలో 6 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. 18 నుండి 28 సంవత్సరాల వయసు గల యువత సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు.