బాలల హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అరసవల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డీపీటీవో విజయకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల ప్రత్యేక కేంద్రాన్ని ఆయన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాంతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విస్తృత కేటాయింపులు జరుపుతోందన్నారు. కార్యక్రమంలో 1, 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, కేఆర్‌ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.