భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాలేదని, అయోధ్యలో రామమందిరం నిర్మాణ తరువాతే నిజమైన స్వాతంత్య్రం అరి ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన భగవతపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అలీఖాన డిమాండ్ చేశారు. మంగళవారం కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మాజీ కార్పొరేటర్ రంతుల్లా ఖాన, బీసీ సెల్ జిల్లా మాజీ చైర్మన కుళ్లాయప్పలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలకు కారణమైన ఆర్‌ఎ్‌సఎ్‌సను నిషేధించాలన్నారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం బాధాకరమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలు వృథా అన్నట్లుగా అమానుష వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. దీనిపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశామన్నారు.