ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతను పోలీస్‌ ఉద్యోగం చేసిన అధికారిలా కాకుండా గేదెలు కాసుకునే వాడిలా కులోన్మాదం చూపాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 23, 2025, 12:32 PM

తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు.. కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనుక మిగతా కులాలు తిరగబడతాయని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, ఎమ్మెల్సీ తలశిల రఘురాం హితవు పలికారు. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని, మాజీ సీఎం వైయ‌స్ జగన్‌ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కుల జాఢ్యానికి నిదర్శనమని ఆయ‌న మండిప‌డ్డారు. ఏబీవీ ‘కమ్మ’ వ్యాఖ్యలపై తలశిల రఘురాం మీడియాతో మాట్లాడుతూ.....  చంద్రబాబు ఆదేశాలతోనే ఏబీ వెంకటేశ్వరరావు చౌకబాబరు చిల్లర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తి కృష్ణా జిల్లాలో పుట్టినందుకు బాధపడుతున్నాం. మాజీ సీఎం జగన్‌గారిపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఏబీవీ చదువుకున్న వ్యక్తిలా, ఉన్నత పోలీస్‌ ఉద్యోగం చేసిన ఐపీఎస్‌ అధికారిలా కాకుండా గేదెలు  కాసుకునే వాడిలా కులోన్మాదంతో మాట్లాడారు. అవి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయి. పుచ్ఛలపల్లి సుందరయ్య, కాకాణి వెంటకరత్నం వంటి మహనీయులు పుట్టిన కృష్ణా జిల్లాలో ఏబీవీ లాంటి వ్యక్తి పుట్టడం మేము అవమానంగా భావిస్తున్నాం.కమ్మ కులం మొత్తం ఒకేతాటిపై నిలబడి జగన్‌గారిని ఓడించాలని ఏబీవీ సెలవిస్తున్నాడు. మరి కేవలం కమ్మ కులస్తులు ఓటేస్తేనే చంద్రబాబు సీఎం అయ్యారా?. ఆ విషయాన్ని ఏబీవీ గుర్తుంచుకోవాలి.మూడు ప్రధాన పార్టీలు ఏకమైనా జగన్‌గారి నేతృత్వంలో ఒంటరిగా పోటీ చేసిన వైయస్సార్‌సీపీ 40 శాతం ఓట్లు సాధించిన విషయాన్ని ఏబీవీ మర్చిపోయినట్లున్నారు. అందుకే ఎన్ని కుయుక్తులు పన్నినా ఆయనకు కులాన్ని ఆపాదించలేరు. జగన్‌గారి ఐదేళ్ల పాలనలో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. అలా రాష్ట్రాభివృద్ధి కోసం పని చేసి, ప్రజల మన్ననలు అందుకున్నారు కాబట్టే అంత మంది ఏకమైనా 40 శాతం ఓట్లతో ప్రజలు ఆయన్ను ఆశీర్వదించారు. ఒక కులాన్ని వర్గ శతృవుగా చూడొద్దని పవన్‌కళ్యాణ్‌ చెబుతుంటారు. ఇప్పుడు ఏబీవీ వ్యాఖ్యలపై ఆయన స్పందించాలి. లేని పక్షంలో ఆయన కూడా కులవాదాన్ని సమర్థిస్తున్నారని మిగతా కులాలు భావించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియాలో చిన్నచిన్న పోస్టులకే కేసులు పెట్టిన ప్రభుత్వం దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలి.అలాగే, మా నాయకుడు జగన్‌గారిపై వ్యాఖ్యలకు ఏబీ వెంకటేశ్వరరావు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com