2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ఉన్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. యంత్రాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంటుతో పాటు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్‌ను మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటీవల నిర్వాసితుల ఖాతాలకు రూ.వెయ్యి కోట్లు జమచేశామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 2వ కట్టరు పని ప్రారంభిస్తుందని.. మూడో కట్టరు ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మూడు కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.