జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ముంబయి బ్యాటర్ రోహిత్ శర్మ 28 పరుగుల చేసి పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 3 పరుగులే చేసిన హిట్‌మ్యాన్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఇవాళ్టి ఇన్నింగ్స్ లో రోహిత్ కొట్టిన పుల్ షాట్ హైలైట్‌గా నిలిచింది. చాలా రోజుల తర్వాత హిట్‌మ్యాన్ ఈ షాట్ ఆడడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగుల తర్వాత... ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని అత్యుత్తమ స్కోరు (28 పరుగులు) ఇవాళ్టి ఇన్నింగ్స్‌లోనే నమోదు కావడం గమనార్హం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో వరుసగా 0, 8, 18, 11, 3, 6, 3, 9 రన్స్ చేసి ఘోరంగా విఫలమైన రోహిత్‌కి ఇది చాలా ఊరటనిచ్చే ఇన్నింగ్స్ అని చెప్పాలి.