కడప జిల్లా, కలకడ మండలం కదిరాయ చెరువు పంచాయతీ బొంతలవారిపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీ లో చేరారు. గురువారం నగరిపల్లెలో ఎమ్మెల్యే కిశోర్ కుమార్‌రెడ్డి సమక్షంలో వారంతా టీడీపీ లో చేరారు. ఆ పంచాయతీ సర్పంచు కె.లక్ష్మీప్రసన్న కమలనాథ్, మాజీ సర్పంచు విశ్వనాథం చెట్టి ఆధ్వర్యంలో వార్డు సభ్యుడు నాగరాజ, రెడ్డెప్ప, శ్రీనాథ, గంగాధర, మునీంద్ర, గురవయ్య, ఆనంద, చర్ల రాజన్న, బత్తల చిన్నప్ప, ప్రసాద్, శ్రీనివాసులు, రామయ్య తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు చేయూతనివ్వాలని పార్టీలో చేరుతు న్నట్లు చెప్పారు.