విశాఖపట్నంలో షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానకిరావు (53) అనే వ్యక్తి కొద్దికాలంగా ఓ మహిళకు తన కుమార్తె అసభ్యకరమైన వీడియోలు చూపించి బెదిరిస్తూ లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్నాడు. దీంతో సదరు మహిళ విసుగు చెంది భీమిలి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.