అక్రమ వలసదారులు అగ్ర రాజ్యం అమెరికాను వీడుతున్నారు. అలాగే, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే నేరస్థులైన అక్రమ వలసదారులను టార్గెట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలకు, హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు.