సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెర తీసింది కూటమి సర్కార్ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజల తరఫున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైయస్ఆర్‌సీపీ సిద్ధమైంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.వైయస్ఆర్‌సీపీలో కొంతకాలంగా భారీగా మార్పులు చేర్పులు జరుగుతున్నది చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో వైయస్ జగన్ విడివిడిగా భేటీ అవుతూ వచ్చారు. రెడ్‌బుక్ రాజ్యాంగం, కీలక నేతలపై అక్రమ కేసులు.. నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వంటి పరిణామాలు చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కేడర్‌కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంతగా ఇబ్బంది పడింది.. వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్లీ మనవేనని.. కాబట్టి పోరాట పటిమ తగ్గకూడదని పిలుపు ఇచ్చారు. అదే సమయంలో ‘మార్పు’ తప్పదనే సంకేతాలిచ్చారు.