వైఎస్ జగన్ విశ్వసనీయత కోల్పోయారని వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ కూడా ఆమోదించారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ జగన్ విశ్వసనీయత కోల్పోయారు కావునే.. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని షర్మిల అన్నారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో షర్మిల మాట్లాడారు. విజయసాయిరెడ్డి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడన్న వైఎస్ షర్మిల.. విజయసాయిరెడ్డి రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని అన్నారు. విజయసాయిరెడ్డి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారన్న షర్మిల.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.