పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం గుంటూరు జిల్లా నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు తరలించే బియ్యం లారీ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోయినా, ఘటనా స్థలంలో 25 కిలోలకు సంబంధించిన 962 బియ్యం బస్తాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపడి లారీపై పడినా, విద్యుత్ తీగలు లారీపై పడకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa