వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో మంగళవారం పశుసంవర్థక శాఖ అధికారులు స్థానిక సర్పంచ్ మల్లెల జగదీశ్, తెదేపా మాజీ సర్పంచ్ చాకలి ఎర్రి స్వామితో కలిసి పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశుఆరోగ్య శిబిరాలను జనవరి 31వ తారీఖు వరకు మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పశువులకు ఉచిత ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.