అనంతపురం నగరంలోని ఆదర్శ నగర్ లో మంగళవారం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ పర్యటించారు. అందులో భాగంగా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల హాజరు శాతాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.
పిల్లలు, గర్భిణీలు బాలింతలకు అందించే పౌష్టికాహార విషయంలో చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు. కాసేపు చిన్నారులతో ఎమ్మెల్యే ముచ్చటించారు.