రాష్ట్రాన్ని గంజాయి రహిత ఏపీగా తీర్చిదిద్దటమే లక్ష్యమని డీజీపీ ద్వారకా తిరుమల అన్నారు. శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గంజాయి నిర్మూలనకు ఐదుగురు క్యాబినెట్ మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. సైబర్ క్రైమ్ నిర్మూలనకు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.