గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ పొడిగింపు, నల్లమడ డ్రెయిన్ ఆధునీకరణ అభివృద్ధి పనులకు సహకరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ను ఆయన కోరారు. సమావేశంలో సానుకూలంగా స్పందించిన మంత్రి ఎమ్మెల్యే బూర్ల వినతి మేరకు చర్యలు చేపట్లనున్నట్లు తెలిపారు.