ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుణ్ని చూడగానే కింద పడిపోయిన వధువు,,సోషల్ మీడియాలో వైరల్,,ఇందులో వాస్తవం ఏంతా...?

international |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 10:04 PM

వివాహం అనేది చాలా పెద్ద ప్రక్రియ. ఫొటోలు చూడటంతో మొదలుపెట్టి.. పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్, పెళ్లి, రిసెప్షన్.. ఇలా రోజుల తరబడి ఈ ప్రక్రియ సాగుతుంది. అయితే పాత రోజుల్లో ఈ సుదీర్ఘ ప్రక్రియ ఉండేది కాదు. పెద్దవాళ్లు వెళ్లి పిల్లను లేదా పిల్లాణ్ని చూసుకొని వచ్చి నేరుగా పెళ్లి చేసేవారు. పెళ్లయ్యేంత వరకు తన భర్త ఎలా ఉంటాడో భార్యకు తెలిసేది కాదు. ఇప్పటికీ ముస్లిం సమాజంలో అక్కడక్కడ ఇలాంటి కట్టుబాట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి కట్టుబాట్ల ఆధారంగా తీసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా 


"బంగ్లాదేశ్‌లో పెద్దలు కుదిర్చిన పెళ్లిలో.. తాను వివాహం చేసుకున్న వ్యక్తిని చూడగానే యువతి స్పృహతప్పి పడిపోయింది." అనే క్యాప్షన్‌తో ఉన్న ఓ వీడియోను unfoldingbharat అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో 2025 జనవరి 25న పోస్టు చేశారు. చాలా మంది అమ్మాయిల విషయంలో ఇది నిజం అని వీడియోపై రాసుకొచ్చారు.


ఇది అసలు వాస్తవం..?


ఈ వీడియో నిజమేనా అని తేల్చడం కోసం సజగ్ టీమ్ వీడియో స్క్రీన్ షాట్‌ సాయంతో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికింది. జనవరి 18న హెదయత్ ఇస్లాం వ్లాగర్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్టు చేసిన వీడియో కనిపించింది. దానికి వైరల్ వీడియో, ఫన్నీ వీడియో అనే హ్యాష్ ట్యాగ్‌లు జతపరిచారు. వీడియో చివర్లో.. బాగా ఫేమస్ అయిన ఆఫ్రికా బుడ్డోడు నవ్వుతున్న పార్ట్ కనిపించింది. అయితే ఇన్‌స్టాలో కనిపించిన వీడియోలో ఈ పార్ట్ లేదు.


దీంతో Bangladesh Arranged Marriage అని ఎక్స్‌లో సెర్చ్ చేయగా.. ఇంతియాజ్ మహమూద్ అనే యూజర్ పోస్టు చేసిన వీడియో కనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వాడిన క్యాప్షన్‌నే ఈ వీడియోకు సైతం వాడారు. జనవరి 25న పోస్టు చేసిన ఈ వీడియో 3.7 మిలియన్ల యూజర్లను రీచ్ కాగా.. 18 వేలకుపైగా లైకులొచ్చాయి. దీంతో మరికొందరు యూజర్లు పోస్టు చేసిన వీడియోలను సైతం సజగ్ టీమ్ గుర్తించింది.


అయితే ఈ వీడియోల కింద తప్పుడు సమాచారం అని రీడర్స్ జత చేసిన కంటెక్స్ట్ కనిపించింది. ఓ ఫేస్‌బుక్ లింక్‌ను సైతం జతపరిచారు. అది క్లిక్ చేయగా.. Wedding Studio అనే ఫేస్ బుక్ పేజీలో ‘భార్య పరిస్థితి ఏంటో అల్లుణ్ని అడగండి’ అని బెంగాలీ భాషలో రాసిన క్యాప్షన్‌తో పోస్టు చేసిన వీడియో కనిపించింది. 2024 జులై 26న పోస్టు చేసిన ఈ వీడియో డ్యురేషన్ 3 నిమిషాల 4 సెక్లన్లు ఉంది.


 


ఫేస్ బుక్ పేజీకి సంబంధించిన సమాచారం చూడగా.. ఇంట్రోలో ‘హలో ఫ్రెండ్స్, నేను డెల్వార్.. సౌదీ అరేబియాలో నివసిస్తున్నాను. మేం ఎవరినీ కించపర్చేందుకు వీడియోలు చేయము. కేవలం మన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికే చేస్తాం. మేం ఎలాంటి పెళ్లి కార్యక్రమం చేయము. మీకున్న ఫిర్యాదులను మాకు తెలియజేయండి’ అంటూ ఈ-మెయిల్ ఐడీ, వాట్సాప్ నంబర్ ఇచ్చారు.


ఇంట్రోలో పేర్కొనట్టుగానే ఈ ఫేస్‌బుక్ పేజీలో పెళ్లికి సంబంధించి రకరకాల స్క్రిప్టెడ్ వీడియోలను పోస్టు చేశారు. దీన్ని బట్టి వైరల్ అవుతోన్న వీడియో స్క్రిప్టెడ్ అని సజగ్ టీమ్ నిర్ధారణకు వచ్చింది.


ఫైనల్ గా తేలింది ఏమిటీ...?


వైరల్ అవుతోన్న వీడియో స్క్రిప్టెడ్ వీడియో. ఇది నిజంగా జరిగిన ఘటన కాదు.


నిజాల కంటే అబద్ధాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఫేక్ న్యూస్, తప్పుదోవ పట్టించే వాట్సాప్ మెసేజ్‌లు, ఫేక్ వైరల్ పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండటం మనందరి బాధ్యత. మీరు కూడా అలాంటి మెసేజ్‌, పోస్ట్ లేదా మీకు సందేహం ఉన్న ఏదైనా లింక్‌ మీ వరకు వస్తే, నిజ నిర్ధారణ కోసం దాన్ని మాకు పంపవచ్చు. నకిలీ వార్తలను పరిశీలించే మా టీం పూర్తి నిబద్ధతతో ఎంక్వైయిరీ చేస్తుంది, నిజానిజాలను మీకు తెలియజేస్తుంది.


కింద ఇచ్చిన Google ఫామ్‌ను ఫిల్‌ చేయడం ద్వారా మీరు ఫేక్‌ అని భావించే వైరల్ పోస్టులు లేదా వీడియోలను మాకు పంపవచ్చు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com