ఏపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో బడ్జెట్ అంచనాలపై ఆర్థిక శాఖ మొదటి సమావేశం నిర్వహించనున్నట్లుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ రాబోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.